Vijay Devarakonda: దిల్ రాజు మనసు గెలుచుకున్న విజయ్ దేవరకొండ!

  • ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్'
  • థియేటర్స్ దగ్గర నిరాశపరిచిన ఫలితం 
  • ఓటీటీలో దూసుకుపోతున్న కంటెంట్
  • విజయ్ దేవరకొండతో మరో సినిమాను ప్లాన్ చేసిన దిల్ రాజు  
  • దర్శకుడిగా రవి కిరణ్ కోలా పేరు తెరపైకి  

Vijay Devarakonda in Dil Raju Movie

విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల థియేటర్స్ కి 'ఫ్యామిలీ స్టార్' సినిమా వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. థియేటర్స్ నుంచి ఈ సినిమా ఆశించినస్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకోలేకపోయింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమా, ఓటీటీలో మాత్రం దూసుకువెళుతోంది. 

ఈ నేపథ్యంలో మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. విజయ్ దేవరకొండ తన కమిట్ మెంట్ తో దిల్ రాజు మనసు గెలుచుకోవడం వలన, ఆయనతోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమాకి దర్శకుడు రవి కిరణ్ కోలా. గతంలో అతని నుంచి వచ్చిన 'రాజావారు రాణిగారు' మంచి విజయాన్ని అందుకుంది. అతను వినిపించిన కథకు దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా పనుల్లో ఉన్నాడు. 

  • Loading...

More Telugu News